పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 10 మార్చి, 2026:వంట గ్యాస్ సిలిండర్ పై 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ పై 115 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ పాలకొండ మండల కేంద్రంలో సిఐటియూ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సిఐటియూ మండల అధ్యక్షురాలు బి. అమరవేణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు పాల్గొని మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం సాకుతో గ్యాస్ ధరలు పెంచడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండించిన ఆయన, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ మహిళలకు గ్యాస్ ధరల పెంపుతో పెద్ద కానుక ఇచ్చారని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎం. శ్యామల, జి. శారద, కే. శారద, ఎల్. జయమ్మ, ఎస్. రజిని, జి. జెస్సి బాయ్, రాధా రాణి, ప్రభావతి, పి. శ్రీదేవి, ధనలక్ష్మి, గౌతమి తదితర ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments