పాలకొండ వెబ్ న్యూస్, 19 మార్చి 2026: పాలకొండలోని ఋషి యోగ కేంద్రం ఐదవ వార్షికోత్సవం మరియు ఉగాది పండుగను పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు.
యోగ గురువు ధనుంజయ గురూజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పల్లా కొండలరావు, జనార్దన్ గురూజీ పర్యవేక్షణలో, సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధనుంజయ గురూజీ యోగా యొక్క విశిష్టతను వివరిస్తూ నిత్య జీవితంలో యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై సాధకులకు పలు సూచనలు మరియు శిక్షణ అందించారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా సాధకులు తమ అనుభవాలను పంచుకోగా, ఉగాది పర్వదినం వేళ యోగ కేంద్రం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
news by: BSS Prasad
0 Comments