ఉగాది వసంత కోయిల.. శ్రీ పరాభవ చైత్ర పాడ్య మాలిక

ఉగాది వసంత కోయిల - శ్రీ  పరాభవ చైత్ర పాడ్య మాలిక
******************************
చైత్ర పాడ్యమి తొలివసంత చివుళ్లు
లేలేత ఆకుపచ్చ చిగుర్లు,
కుహు కుహు రవాల కోయిలమ్మ
గొంతు గుబురుతోటల్లో ప్రతిధ్వని!!!
 
కొంగ్రొత్తవత్సరమాలిక ఈనవ్య  "ఉగాది" షడ్రుచుల సమ్మేలిత
మావిచిగుళ్లువగరు వేప పూతల
చేదు వే తీపి బెల్లాల చింత పులుపు
వెరసి పొద్దు పొద్దున్నే అరచేతిలో
మెరిసే మావన్నెల"ఉగాది పచ్చడి"!

 కోటిఆశల క్రొత్త వధువులా నెట్టింట
సందడితో కొలువుతీరిన ఉగాది
పంచాంగశ్రవణలూ కవివర్యల కవితావేశాలు భావా వేశాలు
నడుమ ఆవిష్కరా మాలిక
మా ఈ నవ్య "ఉగాది" వేడుక!!!

  తెలుగింట కుంకుడు తలంట్లు
సాంబ్రాణి గుగ్గిల్ల ధుపాలు
క్రొంగోత్త పంచెలు సాపులు
భుజాన కండువాలు ఉత్తరీయాలు,
మరచిన తేటతీయని తెలుగుతనం గుబాళించే సరిక్రొత్త వత్సరాది
మాతెలుగు "ఉగాది"!!!

పల్లెపల్లెఅంతా పండగ కోలాహలం
సకుంబసపరివారంగా పొలాల హలాల క్షేత్ర వీక్షణాలు తో సంబ్రమించే"ఊరి"పండుగ"ఉగాది"!

మావిడాకుల తోరణాలు గుమ్మాన
అరటిఆకుల విస్తల్లు నట్టింట
ఆర ఆర విందులు లోగిళ్ళు
మా తెలుగు మండువా లోగిళ్ళు!!!

కర్షక శ్రామికులు స్వేద సైనికులు
కూసింత నిదానంగా నిశ్చలంగా
పర్వదినంగా జరిపే నూతన
వత్సర అచ్ఛతెలుగు పండుగ
మా ఉగాది పండుగ!!!
 తెలుగుతనం తేజరిల్లే పట్టు పరికిణీ పదహారుఅణాల బుట్ట బొమ్మల సందడిమధ్య కోలాహల
వేడుక మా తెలుగు ఉగాది!!!

మొత్తంగా తెలుగోడు ఎక్కడున్నా
అమ్మని ఊరుని బాల్యాన్ని బందాలుని జ్ఞప్తికితెచ్చి కళ్ళు చెమర్చే  షడ్రుచులపండుగ
మన "ఉగాది"...!!!
- నూతులపాటి భరత్ భూషణ్ రాజ్
( ఉత్తరాంధ్రా కవి, రచయిత, సామాజిక ఉద్యమ నేత )
-

Post a Comment

0 Comments