శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా నక్కలపేటలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 27-03-2026:
​పాలకొండలోని సాయి నగర్ నక్కల పేటలో గల సకందేవతా ప్రాంగణంలో రామనవమి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా సీతమ్మను పెళ్లికుమార్తెగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి సారె తీసుకువచ్చే ఘట్టాన్ని భక్తులు కోలాహలంగా చేపట్టారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన నెయ్యి మిఠాయిలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ వస్తువులైన రుబ్బురోలు, సన్ని, తిరగలి ఆకారాల్లో తయారు చేసిన ఈ మిఠాయిలు భక్తుల దృష్టిని ఆకర్షించాయి. ఆలయ ప్రాంగణం భక్తి సంకీర్తనలతో మారుమోగుతుండగా, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకలను కనులారా వీక్షించారు. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
​news by: BSS Prasad

Post a Comment

0 Comments