​మహిళా హక్కుల సాధనకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి

పాలకొండ వెబ్ న్యూస్ :​అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం పాలకొండలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యులు జి శారద అధ్యక్షతన ప్రదర్శన, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి బి లక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు, ఉపాధ్యక్షులు ఎన్ హిమ ప్రభ, అంగన్వాడీ యూనియన్ నాయకులు బి అమరవేణి, ఆశా వర్కర్ల నాయకులు కె గౌరీ, జెవివి జిల్లా అధ్యక్షులు ఎస్ మహేష్, యూటీఎఫ్ నాయకులు రాజకుమారి, ప్రమీల రాణి, సిఐటియు మండల కార్యదర్శి కే రాము మాట్లాడారు. దేశంలో మహిళలు, బాలికలపై దాడులు పెరగడానికి మద్యం, డ్రగ్స్ విచ్చలవిడి సరఫరానే ప్రధాన కారణమని, వీటిని ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు. పురుషాధిక్య ధోరణులు, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల మహిళలకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల సాధన కోసం మహిళలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం శ్యామల, వై మనీ, లలిత, రాధా రాణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments