పాలకొండ వెబ్ న్యూస్, మార్చి 7, 2026:జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి సూచనలతో జిల్లా మానిటరింగ్ టీం సభ్యులు మరియు వివిధ మండలాల విద్యాశాఖాధికారులు శనివారం పాలకొండ మండలంలోని పలు పాఠశాలలను సందర్శించారు. సీతానగరం, గుమ్మలక్ష్మిపురం మండలాల విద్యాశాఖాధికారులు ఎం.వి రమణ, భీముడు, సీతంపేట ఐటీడీఏ సీఎంఓ చల్లా చిరంజీవి బృందం భాసూరు, ఎం సింగపురం, బడ్డు మాసింగి, తలవరం, తంపటాపల్లి పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రాంగణాలు, తాగునీరు, మధ్యాహ్న భోజనం, రికార్డులతో పాటు పదో తరగతి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పరిశీలించి అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో ముచ్చటించి విద్యాభివృద్ధికి మరిన్ని సూచనలు చేశారు. ఇదే సమయంలో భాసూరు ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు నెల్లి వెంకటరమణ సొంత ఖర్చులతో క్రీడా సామాగ్రి సమకూర్చినందుకు అధికారుల బృందం ప్రత్యేకంగా అభినందించింది.
news by: BSS Prasad
0 Comments