రైతే ఒక శాస్త్రవేత్త

పాలకొండ వెబ్ న్యూస్: రైతే ఒక శాస్త్రవేత్త అని పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంట్టబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన 42వ శాస్త్రీయ సలహా మండలి సమావేశం నిరూపించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు అప్పలస్వామి చైర్మన్ గా వ్యవహరించగా, ముకుందరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2026-27 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్, రబీ కార్యాచరణ ప్రణాళికను సమన్వయకర్త గురవ్ మరియు శ్రీనివాసరాజా వివరించారు. శాస్త్రవేత్తల సూచనలు కేవలం మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి ప్రదర్శనల ద్వారా రైతులకు చేరువ కావాలని, పెట్టుబడులు తగ్గించేలా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 58 ఏళ్ల వ్యవసాయ అనుభవం ఉన్న అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావును గౌరవిస్తూ ఆయనతో మొక్క నాటించారు. ఈ కార్యక్రమంలో వెంకటరావు, లక్ష్మణ్, శారద, సంధ్యారాణి, అనంత విహారి, ఉమా జ్యోతి మరియు శాంతి పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments