విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: పాలకొండ శక్తి టీం

పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ మండలంలోని సింగన్నవలస గ్రామంలో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో శక్తి టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు ఆకర్షణలకు లోనుకాకుండా చదువుపై దృష్టి సారించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని శక్తి టీం సభ్యులు సూచించారు. ముఖ్యంగా అమ్మాయిలు ఆత్మవిశ్వాసంతో ఉంటూ తమ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నిరోధం మరియు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ 112, సైబర్ క్రైమ్ 1930, మాదక ద్రవ్యాల నియంత్రణ 1972, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఏఎస్ఐ జి ఝాన్సీ భాయి, కానిస్టేబుల్స్ రాము, గణపతి, సురేష్, దిలీప్, రఘు, మోహన్ కృష్ణ మరియు సౌమ్య పాల్గొన్నారు.

Post a Comment

0 Comments