పాలకొండ మండల, పట్టణ తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుల ఎంపిక

పాలకొండ వెబ్ న్యూస్, తేదీ: 02-04-2026
​పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజం నెలకొంది. నియోజకవర్గ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పాలకొండ మండల పార్టీ అధ్యక్షులుగా గండి రామినాయుడును, పాలకొండ పట్టణ పార్టీ అధ్యక్షులుగా గుమ్మడి సింహాద్రిను పార్టీ అధిష్ఠానం అధికారికంగా ఖరారు చేసింది. నిబద్ధతతో పనిచేసే నాయకులకు గుర్తింపునిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గండి రామినాయుడు మండల అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం, గుమ్మడి సింహాద్రి పట్టణ అధ్యక్షులుగా నియమితులు కావడంతో పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించే వీరిద్దరి నాయకత్వంలో పాలకొండలో తెలుగుదేశం పార్టీ మరింత పుంజుకుంటుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు.
​news by: BSS Prasad

Post a Comment

0 Comments