అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల విషయంలో స్థానికులకు పెద్ద పీట దక్కనుంది. రాష్ట్రంలో 95 శాతం పోస్టులు, సీట్లు స్థానికులకే కేటాయించబడుతున్నాయి. మిగిలిన 5 శాతం ఓపెన్ కోటాలో ఉండనున్నాయి.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్ కొత్త పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్-2025 గెజిట్‌ను జారీ చేసింది. ఈ నూతన ఉత్తర్వుల ప్రకారం, డైరెక్ట్ నియామకాలలో స్థానిక, స్థానికేతర కోటాలను నిర్దేశించడంతో పాటు, జిల్లా, జోనల్ మరియు రాష్ట్ర స్థాయి పోస్టులను స్పష్టంగా వర్గీకరించారు.
కొత్త జోన్లు, స్థానికత గుర్తింపు:
* ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ: గతంలో రాష్ట్రంలో 4 జోన్లు ఉండగా, కొత్త గెజిట్ ప్రకారం ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలను 6 జోన్లు మరియు 2 మల్టీజోన్లగా విభజించారు.
0 Comments