ఈ పవిత్ర కార్యక్రమం ఏప్రిల్ 21 నుండి 24 వరకు నాలుగు రోజుల పాటు శాస్త్రోక్తంగా సాగనుంది. వీరఘట్టం వాస్తువ్యులు సర్వ జ్యోశ్వుల వెంకట లక్ష్మీనరసింహా శర్మయాజీ ఆధ్వర్యంలో వివిధ హోమాలు, శాంతి పూజలు నిర్వహిస్తారు. ఫైర్ స్టేషన్ వెనుక భాగంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఏప్రిల్ 24 శుక్రవారం ఉదయం 7:15 నుండి 7:50 గంటల మధ్య నిర్ణయించిన సుముహూర్తంలో ప్రధాన విగ్రహం ప్రతిష్ఠ చేస్తారు. దీనితో పాటు ఉత్సవ విగ్రహం, పూర్ణకలశం ప్రతిష్ట మరియు శ్రీచక్ర మహాయంత్రం స్థాపనము వంటి ఆధ్యాత్మిక క్రతువులు శాస్త్రబద్ధంగా జరగనున్నాయి.
గ్రామ దేవత కొలువుదీరే ఈ పుణ్య సమయం పాలకొండ ప్రజలకు ఒక గొప్ప వేడుక వంటిది. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే ఈ ప్రతిష్టా మహోత్సవానికి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆహ్వానిస్తున్నారు. ఈ నాలుగు రోజుల పాటు పాలకొండ గ్రామం మంత్రోచ్ఛారణలతో, భక్తి పారవశ్యంతో పులకించనుంది.
news by: BSS Prasad
0 Comments