పాలకొండ పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రేపు అనగా ఫిబ్రవరి 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పాలకొండ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. విష్ణు మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. 33/11 కేవీ పాలకొండ సబ్ స్టేషన్ పరిధిలోకి వచ్చే పాలకొండ టౌన్ మరియు రూరల్ ప్రాంతాలైన గొట్ట మంగళాపురం, చిన్న మంగళాపురం, గోపాలపురం, సింగన్నవలస, కొండాపురం, అంపిలి, అన్నవరం, బుక్కూరు, తంపటపల్లి తదితర గ్రామాల్లో ఈ కోత అమలులో ఉంటుంది. మరమ్మతు పనుల దృష్ట్యా వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అధికారులు కోరారు. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
news by: BSS Prasad
0 Comments