శ్రీకాకుళంలో డయేరియా ఉధృతి

సిక్కోలులో డయేరియా ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 26 కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 102కు చేరింది. ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించి బాధితులను పరామర్శించారు. మృతి చెందిన సురేష్ కుటుంబానికి ప్రభుత్వం పది లక్షల రూపాయల పరిహారం అందజేసింది. అయితే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో మున్సిపల్ కమిషనర్ హనుమంతు కూర్మారావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై మున్సిపల్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, అప్పలరాజు బాధితులను పరామర్శించి, మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం సచివాలయ సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహిస్తూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.

​news by: BSS Prasad

Post a Comment

1 Comments

  1. Good 👍. Everything you are taking and giving latest news to readers. I am proud of you 👏

    ReplyDelete