పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 25 ఫిబ్రవరి, 2026:శాసనమండలిలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలపై జరిగిన చర్చలో సభ్యులు పాలవలస విక్రాంత్ పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో కేంద్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి వెల్లడించిన గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 3,041 పరిశ్రమలు మూతపడ్డాయని ఆయన సభకు వివరించారు. ఈ పరిశ్రమల మూసివేత కారణంగా సుమారు 40 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఎస్‌ఎంఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా పరిశ్రమలకు రావాల్సిన విద్యుత్ సబ్సిడీ మరియు వడ్డీ రాయితీలను సకాలంలో అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సబ్సిడీలు సకాలంలో అందితేనే ఈ రంగం నిలదొక్కుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.
news by: BSS Prasad
0 Comments