జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు: గర్భాన సత్తిబాబు పిలుపు

పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 25 ఫిబ్రవరి, 2026:​జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపు అనగా 26వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలలోని జనసైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మరియు పాలకొండ నియోజకవర్గం సీనియర్ నాయకులు గర్భాన సత్తిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యత్వం పొందగోరే వారు 9908677348 నంబరును సంప్రదించాలని ఆయన సూచించారు. పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభ్యత్వ నమోదు కీలకమని ఆయన పేర్కొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments