అమృత్సర్ లోని స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం తరహాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువచ్చే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. తితిదే నిర్వహణ, నిబంధనలు మరియు భక్తులకు కల్పించే సౌకర్యాల విషయంలో మరింత పారదర్శకత, స్వయంప్రతిపత్తి ఉండేలా కొత్త చట్టాన్ని రూపొందించే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణ దేవాలయం చట్టంలోని ముఖ్యాంశాలను అధ్యయనం చేసి, తితిదేకి అవి ఏ విధంగా ఉపయోగపడతాయో నివేదిక ఇవ్వాలని సూచించారు. దేవాలయ పవిత్రతను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని చంద్రబాబు స్పష్టం చేశారు.
news by: BSS Prasad
0 Comments