పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 24-02-2026: రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నివారణ పేరుతో 750 విద్యుత్ బస్సుల నిర్వహణను పినాకిల్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడం మరియు 12 డిపోల మూసివేతకు సిద్ధపడటం దారుణమని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ పాలకొండ డిపో కార్యదర్శి వావిలపల్లి రాజేష్ ఖండించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగులు ఉదయం నుండి ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై డిపో వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఇప్పటికే నాలుగు డిపోలను ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం సంస్థ మనుగడకు ముప్పు అని, విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రభుత్వం లేదా ఆర్టీసీ సంస్థే నేరుగా చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కార్యదర్శి డీజి రావు, ఉపాధ్యక్షుడు పి ఎల్ రావు, చైర్మన్ యు సుబ్బారావు, సి ఎస్ సంగమేష్, యు లక్ష్మి, బి వి రమణ, ఎమ్మార్ మూర్తి, ఎం ఆర్ బాబు మరియు గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments