పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 24.02.2026: అంగన్వాడీలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా మంగళవారం పాలకొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట రెండో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఎన్ హిమప్రభ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి అమరవేణి మాట్లాడారు. గత సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, అంగన్వాడీలపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చాలని మరియు సెంటర్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే విజయవాడ మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి శారద, ఎం శ్యామల, శ్రీదేవి, వైమణి, లలిత, జి భాయ్, దివ్య, సునీత పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments