పాలకొండ వెబ్ న్యూస్, మార్చి 02, 2026:పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ పరిధిలోని వడమ గ్రామంలో వేంచేసి ఉన్న రామాలయ అభివృద్ధికి పాలకొండ టిడిపి నేత పల్లా కొండలరావు తనవంతు సహకారంగా 20 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. తరతరాల నుంచి వస్తున్న ఆనవాయితీ ప్రకారం ప్రతి గ్రామంలో రామాలయం ఉండటం మన సంస్కృతిలో భాగమని ఆయన పేర్కొన్నారు. ఏటా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామస్తులంతా కలిసి స్వామివారికి ఎంతో భక్తిశ్రద్ధలతో కళ్యాణం నిర్వహించి, భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొండలరావు కొనియాడారు. ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తనవంతు సాయం అందించడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.
news by: BSS Prasad
0 Comments