ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సత్య సాయి టాలెంట్ పరీక్ష

పాలకొండ వెబ్ న్యూస్, 02 మార్చి 2026: సరదా చదువులు ఆధ్వర్యంలో వీరఘట్టం, పాలకొండ, గరుగుబిల్లి, జిఎం వలస, రేగిడి ఆముదాలవలస మరియు బూర్జ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు సత్య సాయి టాలెంట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ప్రతి పాఠశాల నుండి ఐదో తరగతికి ఒకరు, ఎనిమిదో తరగతికి ఇద్దరు విద్యార్థులను ఎన్రోల్ చేసుకోవాలి. ఎంపికైన విద్యార్థులకు మార్చి 8వ తేదీ ఉదయం 9 గంటలకు పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష జరుగుతుంది. ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన మొదటి పది మందికి మౌఖిక పరీక్ష నిర్వహించి నగదు ప్రోత్సాహకాలు, మెమెంటోలు, సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల పాఠశాలలు విద్యార్థి పేరు, పాఠశాల, మండలం మరియు హెచ్ఎం వివరాలను 9491568345 నంబరుకు వాట్సాప్ చేయాలని కన్వీనర్ ఎన్వి రమణ, కో కన్వీనర్ మరడాన సంపత్ కుమార్ కోరారు. గత నవంబర్‌లో పదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments