పాలకొండ వెబ్ న్యూస్, మార్చి 02, 2026: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం తూడి గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలోని జీడి మామిడి తోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సుమారు పది ఎకరాల మేర పంట కాలి బూడిదైంది. మంటలు వ్యాపిస్తున్న విషయాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందితో కలిసి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు. గ్రామస్తుల చొరవ, అగ్నిమాపక శాఖ వేగవంతమైన స్పందన వల్ల మంటలు ఇతర తోటలకు వ్యాపించకుండా ఆగిపోయాయని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
news by: BSS Prasad
0 Comments