పాలకొండలో జోరుగా జనసేన సభ్యత్వ నమోదు

పాలకొండ వెబ్ న్యూస్: పాలకొండ పట్టణంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోంది. పట్టణంలోని 13వ వార్డులో కొండదాడి రాజేష్ ఆధ్వర్యంలో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజల నుంచి ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులై అనేకమంది స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ కొంచాడ అరుణ్, వైస్ ఎంపీపీ వాకముడి అనిల్ మరియు ఏఎంసీ డైరెక్టర్ డొంక శివ ప్రసాద్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఇంటికీ వెళ్లి సభ్యత్వాల ప్రాముఖ్యతను వివరిస్తున్నామని నాయకులు ఈ సందర్భంగా తెలియజేశారు.

Post a Comment

0 Comments