​సిపిఐ ప్రజల పక్షం: పాలకొండలో ఇంటింటా ప్రచారం

​పాలకొండ వెబ్ న్యూస్..తేదీ: 04-03-2026:భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా పాలకొండలో ఇంటింటా ప్రచారం మరియు విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు, నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది ఉత్తరావల్లి మురళీమోహన్ నివాసం వద్ద కరపత్రం విడుదల చేసి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మన్మధరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, రైతుల కోసం సిపిఐ నిరంతరం పోరాడుతుందని, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో పార్టీ ముందుంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గ కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుపరం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పువ్వల ప్రసాదు, ద్వారపూడి అప్పలనాయుడు, రౌతు దుర్గాప్రసాద్, మండంగి సింగన్న, బిడ్డిక పొత్తా తదితరులు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments