పాలకొండ వెబ్ న్యూస్, మార్చి 5, 2026: పాలకొండ పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ లోని రికార్డులను, పరిసరాలను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా రహదారి భద్రతపై దృష్టి సారించాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, గంజాయి వంటి వ్యసనాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ చైతన్యపరచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
news by: BSS Prasad
0 Comments