ఏపీలో జనాభా పెరుగుదలకు భారీ ప్రోత్సాహకాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా సమతుల్యతను కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయాలు ప్రకటించారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం కలిగిన దంపతులకు ప్రభుత్వం తరపున భారీ ఆర్థిక చేయూతను అందించనున్నారు. కాన్పు సమయంలోనే తల్లిదండ్రులకు 25,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. కేవలం తక్షణ సాయమే కాకుండా, ఆ బిడ్డ పోషణ నిమిత్తం ఐదేళ్ల పాటు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. దీనికి తోడు 18 ఏళ్ల వరకు ఆ పిల్లలకు ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

​ఉద్యోగుల సంక్షేమంపై దృష్టి సారించిన ప్రభుత్వం, మూడు లేదా అంతకంటే ఎక్కువ సంతానం కలిగిన తల్లులకు 12 నెలల పేరెంటల్ లీవ్, తండ్రులకు రెండు నెలల పెటర్నల్ లీవ్ మంజూరు చేయనుంది. మహిళా భద్రత మరియు సౌకర్యాల కోసం షీ క్యాబ్స్, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను విస్తృతం చేయడంతో పాటు, ఉద్యోగులకు 15 రోజుల వెల్నెస్ లీవ్ కల్పిస్తారు. అలాగే ఆరోగ్య నిధి పథకం కింద 50,000 రూపాయల వైద్య సహాయం అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.

.. పాలకొండ వెబ్ న్యూస్ 

Post a Comment

0 Comments