అన్నవరం గ్రామంలో రైతన్న కోసం కార్యక్రమం

​పాలకొండ వెబ్ న్యూస్, తేదీ: 16 మార్చి, 2026​అన్నదాత సుఖీభవ మూడో విడత నిధుల విడుదల సందర్భంగా పాలకొండ మండలం అన్నవరం గ్రామంలో రైతన్న కోసం డోర్ విజిట్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. పాలకొండ నియోజకవర్గ ఇంచార్జ్ పడాల భూదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గండి రామినాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరు గ్రామంలోని ప్రతి ఇంటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. రైతుల కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూనే, కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న వివిధ అభివృద్ధి పథకాలను వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్సీ సెల్ నాయకులు రమేష్, గవర దుర్గారావు, మిన్నరావు, గణపతి, శివ, సతీష్, మహిళలు మరియు సియుబి ప్రతినిధులు పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments