పాలకొండ నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ

​పాలకొండ వెబ్ న్యూస్, 17 మార్చి, 2026:

​పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం పొట్లి గ్రామంలో అరవై లక్షల యాభై వేల రూపాయల వ్యయంతో చేపడుతున్న రహదారి పనులను నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ సందర్శించారు. సాయిబాబా గుడి నుండి అవుట్ స్కట్స్ స్మశాన వాటిక వరకు నిర్మిస్తున్న ఈ రహదారి పనులను కూటమి నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో పని చేస్తోందని స్పష్టం చేశారు. అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని పనిచేసే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తోందని పేర్కొన్నారు. వీరిద్దరూ అధికారంలో ఉండటం మన నియోజకవర్గ ప్రజల అదృష్టమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నేతలు మరియు కార్యకర్తలు  పాల్గొన్నారు.

​news by: BSS Prasad

Post a Comment

0 Comments