మరకత అమృత మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మాస శివరాత్రి

​ పాలకొండ వెబ్ న్యూస్.. 17 మార్చి 2026:ఫాల్గుణ బహుళ చతుర్దశిని పురస్కరించుకొని మంగళవారం సాయంత్రం స్థానిక దేవాలయంలో మాస శివరాత్రి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయంలో వెలసిన శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ సమేత మరకత అమృత మృత్యుంజయేశ్వర స్వామి వారికి సాయంత్రం 6:30 గంటల నుండి విశేష పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు శరత్ స్వామి వారికి శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించగా, అనంతరం 108 బిల్వ పత్రాలతో అష్టోత్తర శత బిల్వార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది.

​పూజా కార్యక్రమాల అనంతరం స్వామి వారికి దశవిధ హారతులు ఇచ్చారు. ముఖ్యంగా నంది హారతి మరియు సర్ప హారతుల దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, కనులపండువగా జరిగిన పంచామృత అభిషేకాన్ని దర్శించుకుని తన్మయత్వం చెందారు. శివనామ స్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణంలో భక్తులందరూ స్వామి వారి దివ్య కృపకు పాత్రులయ్యారు.

Post a Comment

0 Comments