​ఉగాదికి జాబ్ క్యాలెండర్: మంత్రి లోకేశ్ ప్రకటన

 

పాలకొండ వెబ్ న్యూస్..20 ఫిబ్రవరి, 2026:ఉగాది పండుగ నాటికి రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. అమరావతిలోని ఉండవల్లి నివాసంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల మానసిక ఒత్తిడి, ఆత్మహత్యల నివారణకు సంబంధించి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కోచింగ్ సెంటర్ల నియంత్రణపై ప్రజాభిప్రాయం సేకరించాలని సూచించారు. రాష్ట్రానికి వస్తున్న పారిశ్రామిక పెట్టుబడుల ద్వారా ఈ ఏడాది రెండు లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని స్పష్టం చేశారు. విదేశీ యూనివర్సిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, విధివిధానాలపై ఈ సమావేశంలో చర్చించారు.

​news by: BSS Prasad

Post a Comment

3 Comments